హైదరాబాద్, కరోనా విపత్కర పరిస్థితుల్లో మహిళలు అందించిన సేవలు,చూపించిన ధైర్యసాహాసాలకు సెల్యూట్ చేస్తున్నట్లు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో మహిళలు సంరక్షకులుగా, ఫ్రంట్‌లైన్ యోధులుగా చేసిన త్యాగాలు అపూర్వమన్నారు. అన్ని రంగాల్లో మహిళలు సత్తా చ–ాటాలని, వారు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిలో మహిళలకు ప్రముఖ స్థానం ఉందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నారని, పలు రంగాల్లో విజయాలు సాధిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని అన్నారు. కరోనా కాలంలో మహిళలు ఎన్నో త్యాగాలు చేసి, ధైర్యంగా వైరస్‌తో పోరాడుతున్నారని అభినందించారు. ఇక ముందు కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement