పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా మారిన సీన్
వ్యతిరేక వర్గాలను సానుకూలంగా మార్చేసిన అధినేత
రెండు స్థానాల్లోనూ విజయంపై శ్రేణుల్లో విశ్వాసం
కేసీఆర్ ప్లానింగ్‌తో ఉక్కిరిబిక్కిరైన విపక్షాలు
వెల్లువెత్తుతున్న మద్దతు… అనుకూలంగా సర్వేలు
హైదరాబాద్, : పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలంటే.. పోటీకి వెనుకాడిన పరిస్థితుల నుండి గురిచూసి గెలుపుపంజా విసిరే స్థాయికి టీఆర్ఎస్ చేరుకోవడం రాజకీయ వర్గాలనే విస్మయ పరుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెలరోజుల్లో రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాడని, ఏఏ సెక్షన్లు వ్యతిరేకంగా ఉన్నా యని.. లెక్కలు వేసుకున్నాయో వారిలో మెజారిటీవర్గాలు సాను కూలంగా మారిపోయాయని, పరిస్థితులు అర్ధం చేసుకుని.. అధి నేత నుండి మంత్రుల దాకా ఇచ్చిన వివరణలకు, చేసిన వినతు లకు, చేస్తామని కల్పించిన భరోసాకు ఆయా వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతు న్నారు. దీంతో ఒకపుడు.. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలంటే మనవి కావు అనుకునే పరిస్థితి నుండి రెండు ఎమ్మెల్సీ స్థానా లు బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాం అనే స్థితికి చేరామని టీఆర్ఎస్ శ్రేణులు ఫుల్ కాన్ఫిడెంట్‌గా చెబు తున్నాయి. ఈ మార్పుకు సీఎం కేసీఆర్ పక్కా స్ట్రాటజీలు, మెరుపువ్యూహాలే కారణం. సీఎం కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ.. అటు విపక్షాలను, ఇటు సమయం కోసం ఎదురు చూస్తున్న సంఘాలకు షాకిస్తూ.. అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. అభ్యర్ధుల ప్రకటన నుండి, రాజకీయ పార్టీల దృష్టి మళ్ళింపు వరకు, ఉద్యోగ వర్గాల సంతృప్తి వరకు, మంత్రులను, ఎమ్మెల్యేలను ఇన్ఛార్జిలుగా నియమించే వరకు.. అన్నింటా విపక్షాల ప్లానింగ్‌కు భిన్నంగా దూకుడు ప్రదర్శించి.. నలు వైపులా ఒకేసారి మోహరించి ప్రత్యర్ధులను ఊపిరి పీల్చు కోకుండా చేశారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానంలో ఆదినుండీ టీఆర్ఎస్కు ఎడ్జ్ ఉందని ప్రచారం ఉం డగా, క్షేత్ర స్థాయిలో కలిసిరాని వారిని.. అలకబూనిన వారిని బుజ్జగించి ఒప్పించడంలో సక్సెస్ కావడంతో అక్కడ మెరు గైన స్థితిలో ఉన్నామని టీఆర్ఎస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ కావడం, అధికార కేంద్రానికి దగ్గరి వ్యక్తి కావ డంతో.. మొదట్లో కొందరు వ్యక్తులు, సంఘాలు వ్యతిరేక ప్రచారం చేసినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో పల్లా రాజేశ్వరరరెడ్డి వాటిని నేర్పుగా అధిగమిస్తూ వచ్చారు. ఎన్నికలకు సంబంథించి ప్రతి అస్త్రాన్ని వాడుతూ వచ్చారు. జనవరిలో ప్రచారం ప్రారంభించిన సమయానికి ఉన్న పరిస్థి తులు, ఇప్పటి పరిస్ధితులు గణనీయంగా మారిపోగా.. స్పష్టం గా ఎడ్జ్ కనబడుతోందని ఆ వర్గాలు చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ ఈ స్థానంలో ముందునుండీ ప్రచారం చేసుకోమని పల్లా రాజేశ్వరరెడ్డికి చెప్పడంతో పాటు ప్రచారం సందర్భంగా ఏఏ అంశాలను ఎలా ప్రస్తావించాలో చెప్పారు. చెప్పినట్లే దూసుకుపోయారు.
మెరుపు దూకుడు
ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానం లో టీఆర్ఎస్ పోటీచేస్తుందా లేదా.. అన్న సందేహాలు మొదట రాజకీయవర్గాల్లో వ్యక్తమైంది. టీఆర్ఎస్ నేతలు కూడా అం దుకు తగ్గట్లుగా మౌనం వహించారు. మధ్యలో స్వతంత్ర అభ్యర్ధికి మద్దతు ప్రకటించవచ్చన్న ప్రచారం జరిగింది. వీట న్నింటినీ తిప్పికొడుతూ అనూహ్యంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, క్లీన్ ఇమేజ్ కలిగిన వాణిదేవిని బరి లోకి దింపారు. అటు సామాజిక సమీకరణలు, ఇటు క్లీన్ ఇమేజ్, వీటికి తోడు టీఆర్ఎస్ కు సంబంధించి ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్‌రావును, పాలమూరులో మంత్రి ప్రశాంత్ రెడ్డిని, హైదరాబాద్‌లో సామాజిక సమీకరణ అవస రాల రీత్యా గంగుల కమలాకర్‌ను ఇన్ఛార్జిలుగా పెట్టి చక్రం తిప్పారు. ఎన్నికల్లో ఇంతకాలం విపక్షాలు ప్రచారం చేసిన ఉద్యోగాల అంశంతో మొదలుపెట్టి, ఐటీఐఆర్, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు ఇలా ఒక్కో అంశం ఒక్కో రోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ద్వారా సమర్ధంగా తెరపైకి తెచ్చి.. విపక్ష బీజేపీ అస్త్రాలన్నీ నిర్వీర్యం చేసి ఆత్మరక్షణలో పడేశారు. మరోవైపు రాష్ట్రంలో మరో రెండున్నరేళ్ళకు పైగా అధి కారంలో ఉంటామని, సమస్యలు తీర్చాల్సింది తామేనని గుర్తుచేస్తూ.. గతంలో సమస్యలను సకాలంలో తీర్చలేకపో వడానికి గల కారణాలను సంతృప్తిపరిచేలా వివరించడంతో ఉద్యోగవర్గాలు కూడా సంతృప్తి వ్యక్తం చేశాయి. గత కొంత కాలంగా తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న భావనలో ఉన్న అన్నివర్గాలను కలిసి సమస్యలపై చర్చించి భరొసానివ్వడంలో సఫలం కావడంతో అనూహ్యంగా హైదరా బాద్ స్థానంలో రేసులోకి దూసుకొచ్చింది. పోటీకి తటప టాయించిన పరిస్థితి నుండి ప్రత్యర్ధులు కూడా మెచ్చే అభ్యర్ధిని ఎంపికచేయడం, రాజకీయ రణవ్యూహాలతో మేమే గెలవ బోతున్నాం అనే స్థితికి చేర్చడం సామాన్యవిషయం కాదని, సీఎం కేసీఆర్ మనసుపెడితే రాజకీయం ఎలా ఉంటుందో.. ఈ రెండు స్థానాలు గెలవడం ద్వారా తాము చూపించ బోతు న్నామని టీఆర్ఎస్ ముఖ్యనేతలు ధీమాగా చెబుతున్నారు. తాజా సర్వేల అనంతరం రెండు స్థానాల్లో గెలుపుపై టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికలలో కెసిఆర్ పక్కా స్ర్టాటజీ…
Advertisement
తాజా వార్తలు
Advertisement