హైదరాబాద్ – ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా షేక్‌పేటలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు మంత్రి కెటిఆర్. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కెటిఆర్ సామాన్య ఓటరు లా క్యూలో ఉండి తన ఓటును వేశారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివారం సెలవుదినమని ఇంట్లో ఉండకుండా.. ప్రతి ఒక్కరూ సాయంత్రం నాలుగు గంటల్లోగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలన్నారు. విద్యావంతులు ఓటింగ్ దూరంగా ఉంటారనే అపప్రదను దూరం చేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధికి కృషి చేసే అభ్యర్థికే ఎన్నికల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా విద్యావంతులంతా ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పరిధిలో 39శాతమే పోలింగ్ జరిగిందని, ఈ సారి పోలింగ్ శాతం పెరగాలని ఆకాంక్షించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement