Friday, November 22, 2024

ఆహార‌ క‌ల్తీపై సిఎం కెసిఆర్ మ‌నవ‌‌డి పోరాటం..

హైదరాబాద్‌, : ఆహార కల్తీ సమస్య గ్రామాలను వెంటాడుతోందని, ఇదొక పెద్దక సమస్యగా తయారైందని దీనిని నిర్మూలించడానికి ‘షోమా’ అనే చిన్న తరహా పరిశ్రమను స్థాపిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియాలో ఒక పోస్టు చేశారు. తాగే నీరు నుంచి మొదలుకుని ప్రతి ఆహార పదార్థాన్ని ఆదాయార్జన కోసం కల్తీ చేస్తున్నారని పేర్కొన్నారు. గంగాపూర్‌-యూసుఫ్‌ఖాన్‌ పల్లి గ్రామాల సహకారంతో ఈ పరిశ్రమను ప్రస్తుతానికి చిన్న తరహాలో ఏర్పాటు చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో మరిన్ని ఈ తరహా కార్యక్రమాలు చేపడతానని హిమాన్షు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement