హైదరాబాద్ : ఆర్థిక స్వావలంబనతో మహిళలకు నిర్ణయాధికారం పెరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
దళిత్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(డిక్కీ) ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ఒక హోటల్లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా బలపడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు రకరకాలుగా వివక్షకు గురవుతున్నారు. ఏడాది పొడవునా, ప్రతి రంగంలో మహిళలకు ప్రాధాన్యత దక్కాలన్నారు.. టీ – ప్రైడ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం దళిత మహిళలు పారిశ్రామికంగా ఎదిగేందుకు ఆర్థిక చేయూతనిస్తుందని ఆమె తెలిపారు. డిక్కీ అనేక మంది దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేస్తోందన్నారు.
ఆర్థిక స్వావలంబనతో మహిళలకు నిర్ణయాధికారం సాధ్యం – కవిత
Advertisement
తాజా వార్తలు
Advertisement