Wednesday, December 25, 2024

గిరిజ‌నుల పౌష్టికాహారంపై గ‌వ‌ర్న‌ర్ ఆరా…

హైదరాబాద్‌, : తెలంగాణలో గిరిజన ప్రాంతాల్లో పౌష్టికాహార స్థితిగతులను తెలుసుకుని తనకు వివరాలను ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌ అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ అనంతరం వారికి అందుతున్న పౌష్టికాహారంపై ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తెలంగాణలో పరిస్థితులను అడిగి తెలుసుకు న్నారు. గిరిజన ప్రాంతాల్లో మహమ్మారి ప్రభావం పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను తాను స్వయంగా పరిశీలిస్తానని, పుదుచ్చేరి నుంచి రాష్ట్రానికి వచ్చాక ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తానని అన్నారు.
గిరిజన ప్రాంతాల్లోని పరిస్థితులను తెలుసుకునేందుకు రాజ్‌భవన్‌ అధికారులు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) అధికారులతో కూ డా తనకు వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన ప్రాం తాల్లోని ప్రజలకు న్యూట్రిషన్‌ సప్లిమెంటరీ ఫుడ్‌ను పంపిణీ చేసేందుకు నిపుణులు సహకరించాలని అన్నారు. ఈ మేరకు ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ తర పున యువత వాలంటీర్ల సేవలను భాగస్వాములను చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement