బేగంపేట విమానాశ్రయంలో నేటి నుంచి వింగ్స్ ఇండియా ఎయిర్ షోను నిర్వహించనున్నారు. గురువారం నుంచి నాలుగురోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఎయిర్ షో లు నిర్వహించనున్నారు.
ఈ నెల 21 వరకు నిర్వహించే ఈ షోలో 25 వరకు విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. తొలిసారిగా ప్రదర్శనకు వస్తున్న బోయింగ్‌తో పాటు ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ ఏ350 లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
మొదటి 2 రోజులు వ్యాపార, వాణిజ్య వేత్తలకు, ఆ తర్వాత రెండు రోజులు సామాన్యులను సైతం అనుమతిస్తారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఉన్నతాధికారుల రాకను పురస్కరించుకుని 600 మంది కానిస్టేబుళ్లు, 30 మంది ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు ఏసీపీలతో పాటు ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు. విమానాశ్రయాన్ని డాగ్‌స్క్వాడ్‌తో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు.