హైదరాబాద్ – కర్నాటక విజయంతో కాంగ్రెస్‌లో రెట్టించిన ఉత్సాహం ముందుకు వెళ్తోంది. తెలంగాణపైనే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా. నేటి నుంచి మూడురోజుల పాటు జాతీయ యువజన కాంగ్రెస్ సమావేశాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ క్షత్రియ హోటల్‌లో ఈ సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి నేతృత్వంలో జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు 29 రాష్ట్రాల నుంచి 7 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు హాజరుకానున్నారు.
హాజరుకానున్న యువజన జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్, జాతీయ ఇంఛార్జి కృష్ణ ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధానకార్యదర్శులు, కార్యదర్శులు ఇందులో పాల్గొంటారు. త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలల్లో యువజన కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశాలకు హాజరు కానున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్‌రావ్ ఠాక్రే స్పెషల్ గెస్టులుగా హాజరుకానున్నారు..
యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్, 33 రాష్ట్రాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరవుతారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో జాతీయస్థాయి యువజన కాంగ్రెస్ సమావేశాలు జరగడం ఇదే మొదటిసారని తెలిపారు