జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్కు హైదరాబాద్ వేదిక కానుంది. మార్చి 29నుంచి ఏప్రిల్ 3వరకు జాతీయ హ్యాండ్బాల్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుతం రంగసంస్థలకు చెందిన 30జట్లు పోటీపడనున్నాయి. ఈ విషయాన్ని జాతీయ హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రావు వెల్లడించారు. పోటీల్లో పాల్గొనే జట్టు వచ్చే నెల 25లోపు జాతీయ లేదా తెలంగాణ హ్యాండ్బాల్ సంఘానికి సమాచారం అందించాలని తెలిపారు. సూరూర్నగర్ స్టేడియం, ఎల్బీనగర్లోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ పోటీలకు ఆతిథ్యం ఇవనున్నాయన్నారు.
పోటీల్లో పాల్గొనే జట్లకు ఉచిత వసతి, భోజన, రవాణ సదుపాయం కల్పించనున్నామని జగన్ మోహన్రావు పేర్కొన్నారు. ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి విధిగా కరోనా పరీక్షలు నిర్వహించనున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు మేరకు నిబంధనలను పాటించి టోర్నీని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జాతీయ హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రావు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..