Monday, December 2, 2024

TG | మూసీ ప్రక్షాళనతో హైద‌రాబాద్ మ‌రో సియోల్ అవుతుంది : ఎంపీ చామల కిరణ్

భువనగిరి, అక్టోబర్ 22(ఆంధ్రప్రభ ) : పర్యావరణంపై దుష్ప్రభావం పడకుండా వ్యర్థాలను పునర్వినియోగంలోకి తెచ్చే అద్భుత సాంకేతిక పరిజ్ఞానం సియోల్ లో వినియోగంలో ఉందని… ఈ టెక్నాల‌జీతో మూసి నదికి పునర్జీవం పోస్తే హైదరాబాద్ కూడా సియోల్ నగరంగా మారనుందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

దక్షిణకొరియా రాజధాని సియోల్ లో నాలుగు రోజుల పర్యటన నేపథ్యంలో నేడు రెండో రోజులో భాగంగా మాట్లాడారు. సీయోల్ నగరం నడిబొడ్డు నుండి ప్రవహించే చెంగిచియాన్ నది.. హైదరాబాద్ మధ్యలో ప్రవహించే మూసి లాగా మురికిమయంగా ఉండేదని చెప్పారు. అయితే ఈ నదిని సియోల్ నగర పాలక సంస్థ ప్రక్షాళనతో అత్యంత సుందర నగరంగా మారిందని చెప్పారు. కాగా, నదులు వాటి ప్రక్షాళన, అనంతరం చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే వనరుల పునర్వినియోగంపై రివర్స్ ఫ్రంట్ అధికారులతో చర్చించారు.

మూసినది ప్రక్షాళనతో హైదరాబాద్ నగరం కూడా మరో సియోల్ గా మారనుందని అన్నారు. చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే పునర్వినియోగం ప్లాంట్లను తెలంగాణా ప్రభుత్వం నెలకొల్పుతుందని వివరించారు. మూసీ నది ప్రక్షాళన తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement