Saturday, November 23, 2024

Hyderabadలో రెండు రోజుల తాగునీటి స‌ర‌ఫ‌రా బంద్

లీకేజ్ పైపుల‌కు మ‌ర‌మ్మ‌తులు
నీటి స‌ర‌ఫ‌రాకు ఆటంకాలు
24, 25 తేదీల‌లో స‌ర‌ఫ‌రాకు బ్రేక్

హైదరాబాద్ కి తాగునీరు సరఫరా చేసే ఫేస్‌-3లోని 2375 ఎంఎం డయా ఎంఎస్‌ పంపింగ్‌ మెయిన్‌కు లీకేజీ ఏర్పడింది. దీనిని అరికట్టడానికి మరమ్మతు పనులు చేయనున్నారు. ఈ నెల 24వ తేదీ (గురువారం) ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 25వ తేదీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటల వరకు పనులు చేపట్టనున్నారు. దీంతో 24 గంటలు పలు రిజర్వాయర్‌ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో ఆటంకం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు..

తాగునీరు స‌ర‌ఫ‌రా నిలిచిపోయే ప్రాంతాలు …

శాస్త్రిపురం, బండ్లగూడ, భోజగుట్ట, షేక్‌పేట, జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌, ప్రశాసన్‌నగర్‌, తట్టిఖానా, లాలాపేట్‌, సాహేబ్‌నగర్‌, ఆటోనగర్‌, సరూర్‌నగర్‌, వాసవీ రిజర్వాయర్లు, సైనిక్‌పురి, మౌలాలి, గచ్చిబౌలి, మాదాపూర్‌, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్‌, స్నేహపురి, కైలాసగిరి, దేవేంద్రనగర్‌, మధుబన్‌, దుర్గానగర్‌, బుద్వేల్‌, సులేమాన్‌ నగర్‌, గోల్డెన్‌ హైట్స్‌, 9 నంబర్‌, కిస్మత్‌పూర్‌, పెద్ద అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement