Saturday, January 18, 2025

Hyderabad – హోర్డింగ్స్ దించుతుండ‌గా విద్యుత్ షాక్ – ఇద్ద‌రి మృతి..

హైదరాబాద్‌: నగరంలోని హబ్సిగూడలో విషాదం చోటుచేసుకుంది. హోర్డింగ్‌ దింపే సమయంలో విద్యుత్‌ షాక్‌ కొట్టడంతో ఇద్దరు కూలీలు బాలు (37), మల్లేశ్ (29) మృతి చెందారు.


ఓ చిట్‌ఫండ్‌ కంపెనీకి సంబంధించి హోర్డింగ్‌ దించేందుకు బాలు కూలికి వచ్చాడు. సహాయం కోసం రామంతాపూర్‌లో ఉన్న మల్లేశ్‌ను పిలిచాడు. భవనం 2వ అంతస్తులోని హోర్డింగ్‌ను దింపేందుకు వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో హోర్డింగ్‌ జారి అక్కడే ఉన్న 11 కేవీ విద్యుత్‌ తీగలపై పడింది. దీంతో ఇద్దరికి షాక్‌ కొట్టి ఘటనాస్థలంలోనే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. వారి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement