Saturday, July 6, 2024

Hyderabad – స‌హ ఉద్యోగిపై రియల్‌ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లు లైంగిక దాడి…

హైద‌రాబాద్ – జేఎస్ఆర్ సన్ సిటీ రియల్‌ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న యువతిపై అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు హత్యాచారానికి యత్నించిన ఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లాకు చెందిన ఓ యువతి గత నెలలో నగరానికి వచ్చి ఉప్పల్‌లో నివాసం ఉంటూ మియాపూర్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ డిపార్ట్ మెంట్‌లో ట్రైనీగా జాయిన్ అయింది.


అయితే అదే రియల్‌ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు సైట్ విజిట్ కోసం అంటూ ఆ యువతిని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లి ఆమెపై హత్యాచారానికి యత్నించారు. అయితే వారి నుండి తప్పించుకున్న ఆ యువతి గతరాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె నుండి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జీరో ఎఫ్ ఐ ఆర్ కింద కేసు నమోదు చేసి, అక్కడి నుండి మియాపూర్‌కు పంపించారు. హత్యాచార ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ సీఐ దుర్గ రామలింగ ప్రసాద్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement