Thursday, November 21, 2024

Hyderabad – నేడు రాహుల్ గాంధీ రాక – కులగణనపై మేధావులతో మీటింగ్

హైదరాబాద్ – కాంగ్రెస్ అగ్ర నేత నేత రాహుల్ గాంధీ మంగళవారం తెలంగాణలో పర్యటించనున్నారు. బుధవారం నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న కులగణనపై మేధావులు, ప్రజలు, వివిధ సామాజిక వర్గాలతో సమావేశం కానున్నారు.

వారి నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఆయన హైదరాబాద్ కు రానున్నారు. రెండు గంటల పాటు సిటీ ఉండి.. తిరిగి మహారాష్ట్రకు వెళ్లనున్నారు.

రాహుల్ మహారాష్ట్ర నుంచి సాయంత్రం 4:45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వస్తారు. సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 5.20 గంటలకు బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్ కు చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటలకు సమావేశంలో పాల్గొంటారు. గంట పాటు సమావేశం జరగనుంది.

- Advertisement -

మీటింగ తర్వాత రాత్రి 7:10 గంటలకు రోడ్డు మార్గం గుండా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోని అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారు.రాహుల్ గాంధీతో మాట్లాడేందుకు 400 మందికి అవకాశం ఇచ్చారు. ఇందులో 200 మంది పార్టీలోని వివిధ స్థాయి నేతలు ఉన్నారు. 200 మందిలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు ఉన్నారు.

మిగతా 200 మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారితో పాటు రిటైర్డ్ జడ్జిలు, ప్రొఫెసర్లు, కవులు, కళాకారులు, మేధావులు ఉంటారని పీసీసీ ప్రకటించింది.

రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి.ఇప్పటికే రాహుల్ గాంధీ కాన్వాయ్ వెళ్లే దారిలో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో 500 ల మందితో బైక్ ర్యాలీ కూడా నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement