Saturday, November 23, 2024

హైదరాబాద్‌లో టెన్షన్‌, టెన్షన్‌.. నుపుర్‌శర్మ వ్యాఖ్యలపై ముస్లింల నిరసన..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో శుక్రవారం కొంత టెన్షన్‌ వాతావరణం నెలకొంది. కొద్ది రోజుల క్రితం బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మ వ్యాఖ్యలకు నిరసనగా ముస్లింలు నిరసన చేపట్టారు. శుక్రవారం పాతబస్తీలోని మక్కామసీదులో ప్రార్థనలు ముగిసిన అనంతరం యువకులు బీజేపీకి, నుపుర్‌శర్మకు, నవీన్‌జిందాల్‌కు, రాజాసింగ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. మహ్మద్‌ ప్రవక్తను కించటపరిచే విధంగా మాట్లాడిన నుపుర్‌శర్మతో పాటు నవీన్‌ జిందాల్‌, రాజాసింగ్‌లను అరెస్టు చేయాలని యువకులు నినదించారు.

దీంతో అక్కడ కొంత సేపు టెన్షన్‌ వాతావరణం నెలకొంది. పరిస్థితిని ముందుగానే గ్రహించిన పోలీసులు మక్కామసీదుతో పాటు పరిసర ప్రాంతాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నినాదాలు చేస్తూ మసీదులో నుంచి బయటకు వచ్చిన వారిని పోలీసులు ఎక్కడికక్కడే సముదాయించి పంపించి వేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయినప్పటికీ బందోబస్తును కొనసాగిస్తున్నారు.
మరో పక్క మెహిదీపట్టణంలోనూ ప్రార్థనల అనంతరం ముస్లిం యువకులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ బయటకు రావడంతో అక్కడా కొంత టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. అక్కడ కూడా పోలీసులు యువకులను ఎక్కడివారిని అక్కడకు పంపించి పరిస్థితి చేయి దాటకుండా చూశారు. అయితే ముందస్తుగా నగరంలో పోలీసు బందోబస్తును మాత్రం కొనసాగిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement