Friday, November 22, 2024

పట్టాలెక్కిన ఎంఎంటీఎస్ రైళ్లు

హైదరాబాద్ నగర ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లు మళ్లీ పట్టాలు ఎక్కనున్నాయి. కరోనా కారణంగా గతేడాది నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు దాదాపు 15 నెలల తరువాత ఇవాళ్టి నుంచి పరుగులు తీయనుంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో ఎంఎంటీఎస్ రైళ్లను నడిపిస్తున్నారు. అయితే, మొత్తం 121 సర్వీసులకు ప్రస్తుతం 10 సర్వీసులను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలి విడతగా లింగంపల్లి – ఫలక్ నుమా, లింగంపల్లి- హైదరాబాద్ మార్గాల్లో వీటిని నడిపిస్తున్నారు. క్రమంగా మరో యాబై సర్వీసులను నడపేందుకు దక్షిణమధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. రైళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.

కాగా, కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎంఎంటీఎస్ రైళ్ల నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రతిరోజు 121 సర్వీసుల ద్వారా 1.65 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement