Wednesday, January 15, 2025

Hyderabad – ప్రేమ వ్య‌వ‌హారం – యువకుడి ఇంటికి నిప్పు

హైద‌రాబాద్‌, ఆంధ‌ప్ర‌భ : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలనగర్​లో ప‌క్కింటోడి ప్రేమ వ్యవహారం ఓ పసి పాపకు శాపంగా మారింది. గోపాలనగర్​లో నివాసం ఉంటున్న ప్రదీప్, అదే ప్రాంతానికి చెందిన స్వాతి అనే డిగ్రీ విద్యార్థిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెను ప్రేమ పేరుతో త‌ర‌చూ వేధించేవాడు. ప‌లుమార్లు ఆ విద్యార్థిని బంధువులు హెచ్చ‌రించినా ప్ర‌దీప్‌లో మార్పు రాలేదు.

ప్రేమ‌పేరుతో పువ్వులు పంప‌డంతో…
స్వాతికి, పువ్వులు పంపడంతో ఆమె బాబాయ్ వివేక్‌నంద ఆగ్రహానికి గురయ్యారు. డీజిల్ తీసుకొని ప్రదీప్ నివాసం ఉంటున్న ఇంటి ముందు తలుపులకు నిప్పు పెట్టి పరారయ్యాడు. ఆ సమయంలో ప్రదీప్ తండ్రి ప్రకాష్ ఒక్కడే ఇంట్లో ఉండటంతో, నిప్పు అంటుకొని గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

- Advertisement -

ప‌క్క పోర్ష‌న్‌లో ఉన్న ప‌సిపాప‌కు గాయాలు
పక్క పోర్షన్ లో ఉంటున్న చాందిని అనే నాలుగేళ్ల పాపాకు కూడా నిప్పంటుకుంది. తీవ్ర గాయాలు కాగా.. కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చాందిని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. హత్య యత్నానికి పాల్పడిన వివేక్‌నంద వాహనాల విక్రయదారుడు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement