హైదరాబాద్ నగరంలో అన్యాక్రాంతమయిన చెరువులను పునరుద్దరణకు అడుగులు వేద్దామని ఇ. వి. డి. యం కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు. ట్రై సిటీ పరిధిలోని రెవెన్యూ, జి. ఐ. ఎస్ హబ్ టీమ్స్, ఇరిగేషన్ విభాగాలకు చెందిన అధికారులతో ఇ. వి. డి. యం కమిషనర్ మంగళవారం బుద్దభవన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో నగరంలో గతంలో వున్న చెరువులు వున్నాయి.. ప్రస్తుతం ఎన్ని వున్నాయి. ఎన్ని చెరువులు అన్యాక్రాంతం అయినాయి. ప్రస్తుత చెరువుల బఫర్ జోన్, ఎల్. ఎఫ్ టి పరిధితో పాటు చెరువుల పునరుద్ధరణ, వాటి రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్ అధికారులతో ఈ సమావేశంలో చర్చించారు.
అనంతరం సిటీ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ సమావేశామయ్యారు. ఈ సమావేశంలో బహుళ అంతస్తులు, గృహ నిర్మాణాలకు అధికారులు క్షేత్ర స్థాయిలో సందర్శించి చెరువులను ఆక్రమిస్తూ ఈ భవన నిర్మాణం జరుగుతుందో లేదా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీంచిన అనంతరం భవన నిర్మాణం కు అనుమతులు మంజూరు చేయాల్సింది కమిషనర్ అధికారులకు సూచించారు.