Tuesday, November 26, 2024

Hyderabad – ఐపీఎస్ ప్రొబేష‌న‌ర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌

188 మందికి శిక్ష‌ణ పూర్తి
ఇందులో మ‌హిళ‌లు 54 మంది
విదేశీయులు 19 మంది

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌ ఘ‌నంగా జ‌రిగింది. 2023 బ్యాచ్‌కు చెందిన 188 మంది ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా అవుట్ ప‌రేడ్ నిర్వ‌హించారు. వీరిలో 56 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. 76వ ఆర్ ఆర్‌ (రెగ్యులర్ రిక్రూట్) ఐపీఎస్‌ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు కేంద్ర హోం మంత్రి నిత్యానంద రాయ్ హాజరయ్యారు.

ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న వారే ఎక్కువ‌
శిక్షణ పూర్తి చేసుకున్న 188 మంది ఐపీఎస్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న అభ్య‌ర్థులే ఎక్కువ‌గా ఉన్నారు. 109 మంది ఇంజినీరింగ్, 15 మంది ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అలాగే న్యాయశాస్త్రంలో నలుగురు, ఆర్ట్స్‌లో 28 మంది, సైన్స్‌లో 22 మంది, వాణిజ్యంలో ఎనిమిది మంది, ఇతర డిగ్రీల్లో ఇద్దరు గ్రాడ్యుయేట్లు ఉన్నారు.

- Advertisement -

38 మంది మ‌హిళ‌లు అవివాహుత‌లే…
మహిళా ఐపీఎస్‌ అధికారులు 54 మంది ఉండగా అందులో 38 మంది అవివాహితులే. అలాగే, 134 మంది పురుషులలో 116 మంది అవివాహితులే. 76వ ఆర్‌ఆర్ (రెగ్యులర్ రిక్రూట్) ఐపీఎస్ బ్యాచ్‌లో 188 మంది భారతీయులు, 19 మంది విదేశీయులు ఫేజ్-1 బేసిక్ కోర్సులో మొత్తం 207 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ తెలిపారు. 19 మంది విదేశీయుల్లో నేపాల్, భూటాన్, మారిషస్, మాల్దీవులకు చెందిన వారున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement