Thursday, November 7, 2024

Hyderabad బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే ఆ రూ.55 కోట్ల‌కు నేనే సంత‌కం పెట్టా: కెటిఆర్

హైదరాబాద్‌: రాష్ట్రానికి రూ. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు నాపై కేసు పెడతారా?” అని బి ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా.. కాంగ్రెస్‌ హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. ఫార్ములా-ఈ కారు రేస్‌ వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం.. అందులోనూ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై విచారణ వేగవంతమైన నేపథ్యంలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడుతూ,
మోటర్ కార్ల రేసింగ్ క్రీడ ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన క్రీడ అని అన్నారు. ఫార్ములా -1 మొదటి రేసింగ్ 1946లో ఇటలీలో జరిగిందని తెలిపారు. ఈ ఫార్ములా వన్ 24 రేసింగ్‌లు నిర్వహిస్తుంది.. భారతదేశం కూడా ఫార్ములా వన్ రేసింగ్ నిర్వహించేందుకు ఎదురు చూసిందని పేర్కొన్నారు.

2003లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే ఈ ఫార్ములా వన్ రేసింగ్ హైదరాబాద్‌లో జరగాలని ఎంతో కష్టపడ్డారు.. కానీ 2011లో ఉత్తరప్రదేశ్‌లో ఫార్ములా వన్ రేసింగ్ నిర్వహించారని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 70, 608 కోట్ల రూపాయలతో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించారని కేటీఆర్ పేర్కొన్నారు. 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ. 103 కోట్లతో హైదరాబాద్‌లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించాన్నారు కెటిఆర్.. ఇలా క్రీడల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కోట్లు ఖర్చు పెడుతుందని తెలిపారు.

- Advertisement -

తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా వన్ రేసింగ్ వాళ్ళను తాను కలిశానని కేటీఆర్ అన్నారు. ఫార్ములా వన్ హైదరాబాద్‌లో నిర్వహించాలని అడిగితే వాళ్ళు తిరస్కరించార‌న్నారు.. దీనితో ఫార్ములా ఈ రేసింగ్‌ను తాను సంప్రదించానని చెప్పారు. హైదరాబాద్ రావాలని కొట్లాడి తీసుకొచ్చామ‌ని వివ‌రించారు.. దీనివల్ల ఎలక్ట్రికల్ వెహికిల్‌లపై ఇంట్రస్ట్ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే ఫార్ములా ఈ రేసింగ్ కోసం 2022 ఆగస్టులో జీవో ఇచ్చామ‌ని.. దీనికి రూ. 35 నుంచి రూ. 40 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. అలాగే ప్రైవేట్ సంస్థ 100 కోట్ల ఖర్చు పెట్టిందని వెల్లడించారు.

దీనివల్ల రూ. 700 కోట్ల ఆదాయం తెలంగాణకు వచ్చింద‌ని. ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. రూ. 100 కోట్ల పెట్టుబడి పెట్టిన గ్రీన్ కో నష్టం వచ్చిందని వెనక్కు తగ్గింది.. ఆ వెంటనే హెచ్ఎండీఏ లో ఉన్న అధికారి అరవింద్ కుమార్ తనను సంప్రదించారని పేర్కొన్నారు. రేసింగ్ కోసం ప్రభుత్వం నుంచే రూ. 55 కోట్లు ఇస్తామని చెప్పి తానే సంతకం పెట్టి ఇచ్చానని అన్నారు.

కేటీఆర్. దీనిలో అరవింద్ కుమార్‌కు ఎలాంటి ప్రమేయం లేద‌ని తేల్చి చెప్పారు.. హెచ్ఎండీఏ నిధులు కాబట్టి కేబినెట్ ఆమోదం లేకుండానే విడుదల చేసే అవకాశం ఉందని అన్నారు. దీంతో తానే రూ. 55 కోట్లు విడుదల చేయమని సంతకం పెట్టానని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ పేరు ప్రపంచ వ్యాప్తంగా చాటేందుకు ఆ నిర్ణయం తీసుకున్నానని కేటీఆర్ చెప్పారు. కానీ తన ఇంట్లోకి డబ్బులు వస్తాయని రేవంత్ రెడ్డి సీఎం కాగానే క్యాన్సల్ చేశార‌ని ఆరోపించారు. రేసు రద్దు చేసినందుకు రేవంత్‌రెడ్డి, సంబంధిత శాఖలపై కేసు పెట్టాల‌ని డిమాండ్ చేశారు. తాము బ్రాండ్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేస్తే.. రేవంత్‌రెడ్డి బ్యాడ్‌ ఇమేజ్‌ తెస్తున్నార‌ని ఫైర్ అయ్యారు.. ఇప్పుడు దానిపై ఏసీబీ కేసు పెడతాం అంటున్నార‌ని అంటూ అసలు ఏసీబీ అంటే రేవంత్ రెడ్డికి మీనింగ్ తెలుసా అని ప్రశ్నించారు.

తన‌పై కేసు న‌మోదు కోసం రాజ్‌భవన్‌లో కాంగ్రెస్‌, బిజెపిలు ఒక్కటవుతున్నాయ‌ని ఆరోపించారు కెటిఆర్. ఆ రెండు పార్టీలు ఒక్కటై బిఆర్ఎస్ ను ఖతం చేసేందుకు యత్నిస్తున్నాయి. త‌న‌ను విచారించేందుకు అనుమతివ్వడం గవర్నర్‌ విచక్షణపై ఆధారపడి ఉంటుంద‌ని చెప్పారు. . అటెన్షన్ డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. తనను అరెస్ట్ చేస్తే చేసుకోమన్నారు. రెండు మూడు నెలలు జైల్లో పెడితే హ్యాపీగా వెళతాన‌ని,.. హ్యాపీగా యోగా చేసుకొని పాద‌యాత్ర చే్స్తాన‌ని పేర్కొన్నారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు రాలేదని కేటీఆర్ చెప్పారు.

ఇక సుంకిశాల ఘటనలో అవినీతి కేసు పెట్టాల్సి వస్తే కృష్ణారెడ్డిపై పెట్టాల‌ని అన్నారు.. రూ.80 కోట్లు నష్టం జరిగిందని అధికారులు నివేదిక ఇచ్చారని అంటూ మేఘా కృష్ణారెడ్డి ఇంటిపైకి ఏసీబీని పంపే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అని ప్ర‌శ్నించారు. . అంతమేర ప్రభుత్వానికి నష్టం చేసిన మేఘాను బ్లాక్‌ లిస్టులో పెట్టే దమ్ముందా?” అని రేవంత్ ను నిల‌దీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement