Wednesday, September 18, 2024

Hyderabad – ముందుగానే ఖైర‌తాబాద్ గ‌ణ‌నాధుడి నిమ‌జ్జ‌నం – రూట్ మ్యాప్ ఖ‌రారు చేసిన పోలీసులు

హైదరాబాద్‌: ఈనెల 17వ తేదీన తెలంగాణలో గణేష్‌ విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ జరుగనుంది. ఈనేపథ్యంలో నిమజ్జనాలకు సంబంధించి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్‌ బడా గణేష్‌ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటన్నరలోపే నిమజ్జనం జరుగుతుందని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ చెప్పారు. ఇదే సమయంలో నిమజ్జనాల కోసం హైదరాబాద్‌లో రూట్స్‌ పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

హైద‌రాబాద్ పోలీస్ క‌మిషన‌రేట్ లో నేడు జరిగిన నిమజ్జన ఏర్పాట్ల సమీక్ష స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ..విగ్రహాల కోసం అన్ని శాఖల అధికారులు, హై లెవెల్ కమిటీ అంత కలిసి నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. బాలాపూర్‌ గణేషుడి కోసం రూట్‌ పరిశీలిస్తున్నామ‌ని చెప్పారు. చిన్న విగ్రహాలు కూడా నిమజ్జనానికి వెళ్లేలా జోనల్‌ కమిషనర్‌లు అన్నీ పరిశీలిస్తున్నాన‌మ‌ని పేర్కొన్నారు. . జీహెచ్‌ఎంసీ సిబ్బంది రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లు, వైర్లను తొలగింపు ప్ర‌క్రియ ప్రారంభించామ‌న్నారు.

- Advertisement -

నిమజ్జనాల కోసం మండప నిర్వాహకుల కోరిక మేరకు అన్ని ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు సిపి. మజ్జనం రోజు 25వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటార‌ని చెప్పారు. . హుస్సేన్ సాగర్ వైపు వస్తున్న ట్రై కమిషనరేట్ పరిధిలోని విగ్రహాలు ప్రశాంతంగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామ‌న్నారు. హుస్సేన్ సాగర్ వద్ద ఘనంగా నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేశామ‌న్నారు. రోజురోజుకు నిమజ్జనాల రద్దీ పెరుగుతోంది. రద్దీకి అనుగుణంగా క్రెయిన్, వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింద‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement