Monday, November 25, 2024

TS: హైద‌రాబాద్ ఖాళీ …. నిర్మానుష్యంగా రోడ్లు…

సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి చాలా మంది సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. సాధారణంగా బతుకమ్మ, దసరా పండక్కి తెలంగాణ జిల్లాలకు సంబంధించిన వారు ఎక్కువగా వెళ్తుంటారు. కానీ సంక్రాంతికి తెలంగాణ జిల్లాలకు చెందినవారితో పాటు ఆంధ్రా వారు కూడా సొంతూళ్లకు వెళ్తారు. దీంతో హైదరాబాద్ సగం ఖాళీగా కనిపిస్తోంది.

ఎప్పుడు బిజీ బిజీగా ఉండే హైదరాబాద్ రోడ్లన్ని ప్రస్తుతం ఖాళీగా దర్శనిస్తున్నాయి. అసలు ట్రాఫిక్ అనే మాటే వినిపించడం లేదు.. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ అంతా నిర్మానుష్యంగా మారిపోయిందని చెప్పుకొవచ్చు. సంక్రాంతి సెలవులను ఎంజాయ్ చేసేందుకు పట్నం వాసులంతా పల్లెలకు వెళ్లారు. షాపు సెట్లర్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లన్ని నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి సెలవుల కారణంగా విద్యార్థులకు సెలవులు ఇవ్వడంతో స్కూల్ జోన్లు కూడా బోసిపోయాయి. సంక్రాంతి మూడు రోజులు హైదరాబాద్ లో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement