రాష్ట్రానికి హైదరాబాద్ ఎకనామిక్ ఇంజిన్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని తాజ్ దక్కన్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రం కుంటుపడుతుందన్నారు. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లుగా కర్నాటకలో పరిస్థితి ఉందన్నారు.
40శాతం కమిషన్ అని అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని పంపారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు కర్నాటకలో బిల్డర్స్ పై ట్యాక్స్ వేస్తున్నారన్నారు. వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.
- Advertisement -