Monday, November 18, 2024

Hyderabad – ఒక చోట కూల్చుడు … మ‌రో చోట సీజ్ డ్ ..

హైదరాబాద్‌: న‌గ‌ర పాల‌క సంస్థ అధికారుల రూటు మార్చారు.. ఎంత‌కాలంగా నివ‌శిస్తున్న వారి ఇళ్ల‌ను ఆక్ర‌మణ పేరుతో కూల్చివేత‌ల‌పై విమర్శ‌లు వెల్లువెత్త‌డంతో త‌న శైలిని మార్పు చేసింది.. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ సాగర్ హోసింగ్ కాంప్లెక్స్, సిరి పూరి కాలనీ, బీఎన్ రెడ్డి కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించి బహుళ అంతస్థుల బిల్డింగ్ లను జిహెచ్ఎంసి అధికారులు నేడు సీజ్ చేశారు. పర్మిషన్ లేకుండా నిర్మించిన ఐదు అంస్థుల బిల్డింగ్‌ను ఖాళీ చేయించి తాళాలు వేశారు.

కాగా, స్థానికులు అధికారులను అడ్డుకోగా భారీ పోలీసు బందోబస్తూ నడుమ బిల్డింగ్ లను సీజ్ చేశారు. సుప్రీం కోర్టులో ఈ బిల్డింగ్ కూల్చివేతలపై స్టే ఉండడంతో అనుమతులు లేని భవనాలకు తాళాలు వేశారు.

ఇక మైలార్‌దేవ్‌పల్లి టీఎన్‌జీవో కాలనీలో అక్రమ కట్టడాల కూల్చివేశారు. సర్వే నం.156/1లోని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు.. పత్రాలు, అనుమతులు లేకపోవడంతో గుర్తించారు అధికారులు. ఎలాంటి పత్రాలు, అనుమతులు లేకుండా నిర్మించిన కాంపౌండ్ వాల్‌ను టీఎన్జీవోస్ కాలనీ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 156/1 ప్రభుత్వం స్థలం ఆక్రమించి ఇతరులకు విక్రయించారు.

- Advertisement -

స్థలం కొన్నవారు కాంపౌండ్ వాల్ నిర్మించగా. ఆ నిర్మాణాలను టీఎన్జీవోస్ కాలనీలో రెవెన్యూ అధికారుల బుధవారం కూల్చివేశారు. బాధితులు జేసీబీని అడ్డుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేశారు. లక్షల రూపాయలు పెట్టి స్థలాన్ని కొన్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు రెవెన్యూ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. ఈ కూల్చివేత‌ల స‌మ‌యంలో జేసీబీని అడ్డుకున్నారు స్థానికులు.. అలాగే జేసీబీ అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మార‌డంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి వారికి స‌ర్దిచెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement