తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు జరిగే పూలపండుగ సంబురాలు రేపటి నుంచి(ఆదివారం) ప్రారంభం కానున్నాయి. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ బేగంపేట్‌లోని వంటకళలో(culinary arts) పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా విద్యార్థులు ఓ వినూత్నమైన ఆలోచన చేశారు. అత్యాధునిక ఎలక్ట్రికల్ కార్వింగ్ టూల్స్ తో పది అడుగుల మంచు బతుకమ్మను తయారు చేసి అందరితో వావ్ అనిపించుకుంటున్నారు.
బతుకమ్మ అంటే “చల్లగా కలకాలం ఉడాలి” అని అర్ధం. వర్షాకాలం చివరిలో ప్రకృతి మానవాళికి అందించే సమృద్ధిని తెలియజేయడానికి ఈ పండుగను జరుపుకుంటారు. ‘బతుకమ్మ’ థీమ్‌తో టాస్క్ లో భాగంగా వంటకళలో పీజీ డిప్లొమా విద్యార్థులు ఎనిమిది మంచు బ్లాక్‌లపై ఉలి, రంపపు వంటి పరికరాలతో ఫ్యూజింగ్ టెక్నిక్‌ని ఉపయోగించి ఈ బతుకమ్మని రూపొందించారు.
400 కిలోల అతిపెద్ద బరువుతో మంచుతో ఈ బతుకమ్మను తీర్చిదిద్దే పనిలో విద్యార్థులు విజయం సాధించారు. అంతేకాకుండా దీన్ని ప్రమిదళతో వెలిగించారు. చివరి మెరుగుల కోసం బంతిపూలతో పాటు ఇతర సాంప్రదాయ పూలను ఉపయోగించారు.