లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. చార్మినార్ ప్రాంతం పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉందన్నారు. అన్ని మసీద్ లో కేవలం ముగ్గురు, నలుగురికి మాత్రమే ప్రార్థనలకు అనుమతి ఉందని తెలిపారు. అందరూ పోలీస్ అధికారులు 9 గంటలకే విధుల్లో ఉంటున్నారన్నారు. సామూహిక దూరం, లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేస్తేనే కేసుల సంఖ్య తగ్గుతుందని చెప్పారు. అనవసరంగా బయటికి వస్తే చర్యలు తప్పవని అంజనీకుమార్ హెచ్చరించారు.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా మూడో రోజు లాక్‌డౌన్ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌లో మినహాయింపు ఇచ్చిన వారు తప్ప అనవసరంగా రోడ్ల మీదికి వస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు.