హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి జరిగిన ఓ ఘటనపై విచారణ జరుపనున్నట్టు సైఫాబాద్ ఏసీబీ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో కారు డ్రైవర్, బస్సు డ్రైవర్ మధ్య వాగ్వాదం జరగడంతో ట్రాఫిక్ జామ్ అయ్యిందని, అయితే ఎటువంటి కవ్వింపు చర్యలు జరగకుండానే పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ వై.సూరజ్ కుమార్ ఒక మహిళతో పాటు మరికొంత మందిని కర్రతో కొట్టినట్టు ఏసీపీ చెప్పారు.
ఇది కాస్తా ఉద్రిక్తతతకు దారి తీసింది. దీంతో స్థానికులు ఎస్‌ఐ తీరుపై పెద్ద ఎత్తున నిరసనన చేపట్టినట్టు తెలిపారు. ఎలాంటి కవ్వింపు లేకుండా ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ బలవంతంగా ప్రజలను చెదరగొట్టారని, ఇందులో ఒక మహిళతో సహా కొంతమంది గాయపడ్డట్టు ఏసీపీ చెప్పారు. దీనిపై విచారణ జరిపి ఎస్‌ఐపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.