Saturday, September 7, 2024

Hyderabad – యువ‌తితో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న – కండ‌క్ట‌ర్ అరెస్ట్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైదరాబాద్‌: ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆర్టీసీ బస్‌ కండక్టర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫరూఖ్‌నగర్‌ డిపోకు చెందిన బస్సులో పుప్పాలగూడ నుంచి హియాయత్‌నగర్‌కు ప్రయాణిస్తున్న యువతితో బస్సు కండక్టర్‌ మణికొండ వద్ద అసభ్యంగా ప్రవర్తించాడు.


ప్రయాణ సమయంలో ఒక కండక్టర్‌ తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని యువతి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం కండక్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి రాయదుర్గం సీఐ వెంకన్న మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కండక్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు చెప్పారు. అనంతరం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement