హైదరాబాద్ – రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు యత్నించిన నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో వేల కోట్ల విలువైన 84 ఎకరాల భూమిని కొట్టేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్న బూరుగుపల్లి శివరామకృష్ణ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించాడు.
అనంతరం ఆ ల్యాండ్ తనదేనంటూ క్లయిమ్ చేసిన శివరామకృష్ణ బిల్డర్ మారగొని లింగం గౌడ్ సాయంతో ల్యాండ్‌లో పాగా వేశాడు. అయితే 2003లో నకిలీ పత్రాలపై కోర్టులో అప్పటి ప్రభుత్వం కేసు వేసింది. అప్పటి నుంచి మొదలైన న్యాయపోరాటంలో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు సాగింది . ఇక చివరిగా శివరామకృష్ణవి నకిలీ పత్రాలని తేల్చిన సుప్రీంకోర్టు, కేసు నమోదు చేయాలనీ ఆదేశించింది. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో శివరామకృష్ణతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగం గౌడ్‌ను అరెస్ట్ చేశారు.