హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో గాలిపటానికి వినియోగిస్తున్న ప్రాణాంతకమైన చైనీస్ మాంజా స్థానికంగా తయారు కావడం వల్లే మార్కెట్‌లో విచ్చల విడిగా లభ్యమవుతోందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ చెప్పారు. ఈ- కామర్స్ వెబ్సైట్లో ఆర్డర్ చేసుకుంటే ఇంటికే వస్తోందని పేర్కొన్నారు. త్వరలో ఈ-కామర్స్ గోదాములపై సోదాలు చేస్తామన్నారు. నిర్వాహకులతో సమావేశం సైతం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ప్రజలు సహకరిస్తేనే నిషేధం
ప్రాణాంతకమైన చైనీస్ మాంజా అరికట్టేందుకు ప్రజలంతా సహకరించాలని సీపీ సి.వి.ఆనంద్ కోరారు. ఎందరి జీవితాల్లో విషాదం చోటు చేసుకుంటున్న చైనీస్ మాంజా నిషేధించామని, ఎక్కడ అమ్మకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకుంటున్నారని చెప్పారు. ప్రజలు సహకరిస్తేనే చైనీస్ మాంజా నిషేధం అవుతుందని చెప్పారు.