తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 దగ్గర నిన్న (సోమవారం) అల్లర్లకు పాల్పడినందుకు 29 మంది బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదైంది. భారతీయ జనతా పార్టీ, బీజేవైఎం, బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే.. అక్కడే ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు వారిని తరిమేశారు.
ఈ ఘటనలో IPC సెక్షన్లు 341, 147 (అల్లర్లకు పాల్పడడం), 148 (మారణాయుధాలు కలిగి ఉండడం), 353, (దాడి లేదా నేరపూరితం), 332, 509 (ఏ మహిళను అయినా అవమానించాలనే ఉద్దేశ్యం) 149, వంటి సెక్షన్ల కింత కేసు నమోదు చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 41 కింద వారికి నోటీసు ఇచ్చి, అందరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతారు. అయితే.. దీనిపై కేసు నమోదైందని, తాము ఇంకా వారిని అరెస్టు చేయలేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు బంజారాహిల్స్ పోలీసులు.