Sunday, January 5, 2025

Accident | శ‌బ‌రిమ‌లైలో హైద‌రాబాద్ బ‌స్సు బోల్తా – డ్రైవ‌ర్ మృతి

హైద‌రాబాద్ : హైదరాబాద్‌కు చెందిన అయ్యప్పస్వాముల బస్సు శబరికి వెళ్తుండగా ఘాట్‌ రోడ్డులో బోల్తా పడింది. ఘాట్‌ రోడ్డులో టర్న్‌ చేస్తుండగా బస్సు కంట్రోల్‌ తప్పి పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టి చెట్లల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌ రాజు మృతిచెందగా, మరో 22మందికి గాయాలయ్యాయి. డెడ్‌బాడీని కొట్టాయం మెడికల్‌ కాలేజీకి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం హైదరాబాద్ మద్దన్నపేట నుంచి.. శబరిమల యాత్రకు బయల్దేరిన అయ్యప్ప స్వాముల బస్సు.. గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొని.. బస్సు చెట్లపై పడడంతో పెనుప్రమాదమే తప్పింది.. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. అందులో ఉన్న 22మంది అయ్యప్ప స్వాములకు స్వల్ప గాయాలయ్యాయి.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని, గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత బస్సును క్రేన్ సహాయంతో పక్కకు తీశారు. ప్రతి ఏడాది లాగానే.. మద్దన్నపేట నుంచి మొత్తం 22మంది గ్రూపు సభ్యులు.. ప్రైవేటు ట్రావెల్ బస్సు మాట్లాడుకుని బయల్దేరారు. మరొక 15మీటర్ల దూరంలో శబరిమల యాత్రకు దగ్గరిదాకా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే పంపానది వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement