ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : తెలంగాణ ఆహారభద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు బేగంపేట, ప్రకాశ్‌నగర్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న చికెన్ షాపుల్లో కుళ్లిన స్థితిలో ఉన్న 700 కేజీల చికెన్ ను గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకుని, యజమానులకు నోటీసులిచ్చారు. ఈ చికెన్ ను మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
చట్నీస్ నాణ్యత నిల్..
కొండాపూర్ లోని శరత్ సిటీ మాల్ లో ఆహారభద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాల్ లో ఉన్న చట్నీస్ లో తనిఖీలు చేయగా ఆహార తయారీకి వాడే పదార్థాలను బొద్దింకలు తిరిగే ప్లేస్ లో ఉంచారని, గోధుమపిండి, రవ్వ వంటి పదార్థాల్లో బ్లాక్ ఫంగస్ వచ్చిందని గుర్తించినట్లు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం వెల్లడించింది. ఉల్లిపాయలు, క్యాబేజీలు కూడా మనుషులు తినేలా లేవని పేర్కొంది. పాత్రలను శుభ్రం చేసే ప్రదేశం చెడువాసనతో ఉందని తెలిపింది. కూరగాయలను కట్ చేయడానికి ఐరన్ చాకుల్ని వాడుతున్నారని పేర్కొంది.