Friday, November 22, 2024

Hyderbad: జంట జలాశయాలకు తగ్గిన ఇన్​ఫ్లో.. అన్ని గేట్లు క్లోజ్​ చేసిన అధికారులు

వర్షాలు తగ్గుముఖం పట్టడంతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో సోమవారం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను పూర్తిగా మూసివేశారు. హిమాయత్ సాగర్‌లోని ఒక గేటు ఒక అడుగు, ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఒక అడుగు మాత్రమే ఓపెన్​ చేసి ఉంచగా.. ఇన్ ఫ్లో పూర్తిగా నిలిచిపోవడంతో ఇవ్వాల సాయంత్రానికి ఈ గేట్లను కూడా మూసివేశారు.

సోమవారం ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా 1786.20 అడుగులకు చేరింది. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763 అడుగులకు గాను 1760 అడుగులకు చేరింది. భారీ వర్షాల తర్వాత ఈ సీజన్‌లో తొలిసారిగా జులై 10న జంట జలాశయాల గేట్లను ఎత్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement