Saturday, November 23, 2024

హైదరాబాద్ విమానాశ్రయానికి ఆసియా-పసిఫిక్ గ్రీన్ ఎయిర్ పోర్ట్స్ గుర్తింపు

హైద‌రాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ గుర్తింపు ల‌భించింది. ప్రతిష్టాత్మ‌క ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంట‌ర్నేష‌న‌ల్ (ఏసీఐ) ఆసియా-ప‌సిఫిక్ గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ రిక‌గ్నైజేష‌న్ 2021 విభాగం కింద ఏడాదికి 25 మిలియ‌న్ ప్ర‌యాణికుల కేట‌గిరిలో గోల్డ్ రిక‌గ్నైజేష‌న్ ద‌క్కింది. సమర్థవంతమైన ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌కు గాను గ్లోబల్ ప్యానెల్ ఈ అవార్డును ప్ర‌క‌టించింది. జీఎంఆర్ హైద‌రాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌(GHIAL) ఈ అవార్డును అందుకోవడం ఇది వరుసగా నాలుగవసారి.

ఏసీఐ గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ రికగ్నైజేష‌న్ కార్య‌క్ర‌మం పర్యావరణంపై విమానయాన పరిశ్రమ ప్రభావాన్ని తగ్గించడానికి అదేవిధంగా అత్యుత్తమ పర్యావరణ కార్యక్రమాలు, పర్యావరణ ఉత్తమ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. GHIAL సీఈవో ప్రదీప్ పానికర్ మాట్లాడుతూ.. స్థిరమైన, సుస్థిర‌ విమానాశ్రయ కార్యకలాపాలను త‌మ‌ వ్యాపారంలో అంతర్భాగంగా భావిస్తామ‌న్నారు. పర్యావరణ అనుకూలమైన రీతిలో కార్యకలాపాలను నిర్వహించేందుకు తాము ఎల్ల‌ప్పుడు కట్టుబడి ఉంటామ‌న్నారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని పరిరక్షించేందుకు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement