Sunday, September 15, 2024

Hyderabad – రూ. 60 లక్షల విలువైన ఎఫిడ్రిన్‌ డ్రగ్స్‌ పట్టివేత

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైదరాబాద్ : హైద‌రాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. హైదరాబాద్‌ నుంచి న్యూజిలాండ్‌కు డ్రగ్స్‌ కొరియర్‌ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద 3 కిలోల ఎఫెడ్రిన్‌ సూడో ప్యాకెట్లను సాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.60 లక్షలు ఉంటుందని చెప్పారు. రెండు ప్యాకెట్లలో డ్రగ్స్‌ పొడిరూపంలో ఉన్నాయన్నారు. నిందితులపై ఎన్డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement