Monday, November 18, 2024

Hyderabad – ఇన్స్పెక్టర్ల తీరుపై సిటీ సీపీ సీరియస్- 12 మందిపై బదిలీ వేటు

ఎన్నో సంచలన కేసులను ఛేదించిన హైదరాబాద్‌ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌ వివాదాలకు కేంద్రంగా మారడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇక్కడ పనిచేస్తున్న కొందరు పోలీసులపై అవినీతి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీసీఎస్ ప్రతిష్ఠ దెబ్బతినకముందే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. తాజాగా ఉన్నతాధికారులు ఈ స్టేషన్ ప్రక్షాళన చేపట్టారు.పనితీరుపై సీపీ సీరియన్..ఆదివారం హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సీసీఎస్‌లోని 12 మంది ఇన్‌స్పెక్టర్లపై బదిలీ వేటు వేశారు. వారిని మల్టీజోన్ 2కు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.

ఇటీవలే సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. మరోవైపు ఏసీపీ ఉమామహేశ్వరావు, ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌పై సస్పెన్సన్ వేటు పడింది. సీసీఎస్‌పై వరుస ఆరోపణలతో తాజాగా 12 మందిని ట్రాన్స్‌ఫర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement