Friday, November 22, 2024

హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం-ట్రాఫిక్ కి తీవ్ర అంత‌రాయం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల వద్ద స్థిరంగా కొనసాగుతున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, నాంపల్లి, లక్డీకపూల్‌, ఖైరతాబాద్‌, శంషాబాద్‌, ఆరాంఘర్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, కిస్మత్‌పూర్‌, గండిపేట్‌, మణికొండ, నార్సింగి, మియాపూర్‌, చందానగర్‌, చాంద్రాయణగుట్ట, బార్కస్‌లో వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉన్నది. మబ్బులు క్రమంగా నగరం మొత్తం విస్తరించడంతో వానకురుస్తున్నది.రాగల 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదలనుందని, దీని ప్రభావంతో నేడు ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈనెల 25 వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు కురిసే వీలున్నదని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement