Wednesday, November 20, 2024

HYD | నల్లా బిల్లు వన్‌టైం సెటిల్‌మెంట్… తుది గడువు పొడిగింపు !

నల్లా బిల్లు వన్‌టైం సెటిల్‌మెంట్‌ గడువు తేదీని పొడిగించాలంటూ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చెల్లింపుల ఆఖరి తేదీని నవంబర్‌ 30 వరకు పొడిగిస్తూ హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ వర్క్స్‌ అండ్‌ సీవరేజ్‌ బోర్డ్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

వాటర్‌ బోర్డు జారీ చేసిన వివరాల ప్రకారం.. వన్‌ టైం సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ వల్ల అక్టోబర్‌ 31 వరకు దాదాపు రూ.49 కోట్ల మేర బిల్లులు వసూలయ్యాయని, 70,335 మంది ఈ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకుని చెల్లింపులు చేశారని వెల్లడించింది.

హైదరాబాద్‌ నగరంలో పేరుకుపోతున్న నల్లా బిల్లులను వసూలు చేసేందుకు వాటర్‌ బోర్డు ఈ వన్‌ టైం సెటిల్‌మెంట్‌-2024 స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఎలాంటి అపరాధ రుసుము (లేట్‌ ఫీజ్‌), వడ్డీలు లేకుండానే వాటర్‌ బిల్లులను చెల్లించే అవకాశాన్ని ప్రజలకు కల్పించింది. దీంతో ప్రజలు కూడా ఈ స్కీమ్‌ను వినియోగించుకుని పెద్ద మొత్తంలో చెల్లింపులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement