- గంగుల కమలాకర్‌కు పాజిటివ్‌గా తేలడంతో పరీక్షల కోసం నేతల క్యూ
ఉమ్మడి కరీంనగర్, ప్రభన్యూస్ బ్యూరో : ఉప ఎన్నికల వేళ హుజూరా బాద్ నియోజకవర్గంలో మళ్లిd కరోనా భయం మొదలైంది. బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ కావడంతో నేతల్లో భయం మొదలైంది. మంత్రి గన్‌మెన్‌ల నుంచి ఆయనతో కలిసి ప్రచారంలో పాల్గొన్న హుజూరాబాద్ మునిసిపల్ చైర్మన్ భర్త శ్రీనివాస్, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ స్వరూపరాణి భర్త చల్ల హరిశంకర్ తోపాటు 30 మంది నాయకులు, గన్‌మెన్‌లు పరీక్షలు చేయించుకున్నారు. కమలాకర్ తోపాటు ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు మరికొందరు మంత్రులు, ముఖ్యనేతలంతా సింగాపురం కెప్టెన్ లక్ష్మీకాంతరావు గెస్ట్‌హౌస్‌లోనే మకాం వేశారు. మంత్రులు రోజు సమీక్షలు నిర్వహించుకోవడం, కార్యకర్తలను సమాయత్తం చేస్తూ ప్రచా రాల్లో పాల్గొంటున్నారు. కరోనా పాజిటీవ్ కేసులు తగ్గడంతో మంత్రుల నుంచి నాయకుల వరకు ఎవరూ మాస్కులు ధరించుకోకుండానే ప్రచారంలో పాల్గొంటున్నారు. కమలాకర్‌కు పాజిటీవ్‌గా తేలడంతో నేతల్లో వణుకు మొదలై టెస్టుల బాట పడుతున్నారు. ర్యాపిడ్ టెస్టులో నెగిటీవ్ వచ్చినా ఆర్టీపీసీఆర్ చేయించుకుంటున్నారు, సీటీస్కాన్ కూ డా కొందరు నేతలు చేయించుకుంటున్నారు. వీటి పరీక్ష ఫలితం రావాలంటే రెండురోజుల సమయం పడుతుంది. మంత్రి కమలాకర్ తనతో కలిసి ప్రచారంలో పాల్గొన్న వారు హోంక్వారంటైన్‌లో ఉండాలని కోర డంతో చాలా మంది నేతలు హుజూ రాబాద్ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. నగర మేయర్ వై. సునీల్‌రావు బుధవారం కరీంనరగ్ కు చేర ుకొని బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ, వరం గల్ నగరపాలక సంస్థ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రచారంలో పాల్గొన్న చాలా మంది నేతలకు కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామ కృష్ణారావులు నాగార్జున సాగర్ నుంచి వచ్చి ఇక్కడ ఆసుపత్రుల్లో కొద్దిరోజులు చికిత్స పొంది హోంక్వారంటైన్‌లో ఉండవలసి వచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ అనేక మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ డబుల్ డోస్ తీసుకొని ఉండాలని, ఎన్నికల డ్యూటీలో పాల్గొనేవారికి, అభ్యర్థులకు తప్పనిసరని ఆదేశించింది. ఎన్నికల సంఘం సూచనలను ఏ మంత్రి, ఏ అభ్యర్థి పాటించడంలేదు. ప్రచారం లో పాల్గొంటున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నేతలు మొదలు కార్యకర్తలంతా మాస్కులను పక్కనపెట్టారు. రోజు ప్రచారంలో ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి, నేతలు ధరించడంలేదు. కమలాకర్‌కు పాజిటీవ్‌గా నిర్ధారణ అనంతరం బుధవారం పలుచోట్ల జరిగిన సమావేశాల్లో కూడా మాస్కులు లేకుండానే ప్రచారం నిర్వహించారు.