ఆంధ్రప్రభ, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో ఉండేదెవరో నేడు తేలనుంది. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం చివరి రోజు. మొత్తం 61 మంది నామినేషన్ వేశారు. స్క్రూటినీ తర్వాత 42 మంది మిగిలారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ ఉపసంహరణకు చాన్స్ ఉంది. ఇప్పటివరకూ నామినేషన్ వేసిన వారిలో మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు.. ఏడు ఇతర పార్టీల నుంచి 32 మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు.
ఒక్కో ఈవీఎంలో 16 మంది వివరాలు మాత్రమే పొందుపరిచే అవకాశం ఉంది. ఆ లెక్కన 42 మందిలో సగం మంది వైదొలగినా 21మంది ఉన్నా కూడా రెండు ఈవీఎంలు తప్పనిసరిగా వినియోగించాల్సి వస్తుంది. ఒకవేళ 32 మంది పోటీలో ఉంటే కనుక నోటాతో కలిపి మూడు ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బుధవారం సాయంత్రం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అధికారులు అభ్యర్థులకు గుర్తులు కేటాయించే అవకాశాలున్నాయి.