Saturday, November 23, 2024

హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లు..

హుజురాబాద్ ఉపఎన్నికలో వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు…తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు అపాయింట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు..లేదంటే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వెయ్యి మందికిపైగా ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగించింది. అయితే దీనికి నినసనగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు అందరు నిరసన తెలిపారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల లోపు దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఏకంగా ఉప ఎన్నికల్లో తమ సంఘం నుంచి వెయ్యి మంది పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని టిఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తున్నారు.

గతంలో నాగార్జున సాగర్ ఉపఎన్నికల సమయంలో కూడా నామినేషన్లు వేశారు ఫీల్డ్ అసిస్టెంట్లు..అయితే చివర్లో నామినేషన్లను విత్ డ్రా చేసుకోవడంతో హై డ్రామాకి తెరపడింది. అయితే ఈ సారి మాత్రం తమను విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించకుంటే ఖచ్చితంగా నామినేషన్ వేస్తామని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement