- ఇక 16 రోజులు… బరిలో 30 మంది
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాజకీయ సెగలు పొగలు కక్కుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు తుది పోటీలో నిలిచారు. బుధవా రంతో ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. 42మంది అభ్యర్థుల నామినేషన్లు సక్ర మంగా నిబంధనల మేరకు ఉండటంతో వాటిని ఎన్నికల సంఘం ఆమోదించింది. ఇందులో 12 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇందులో ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున, వొంటెల లింగారెడ్డి, కొలుగూరి రాజ్‌కుమార్, ఇమ్మడి రవి, అంగోత్ వినోద్‌కుమార్, రేఖల సైదులు, కౌటం రవీందర్, ఎనగనబుల వెంకటేశ్వర్లు, నూర్జాన్ బూగం, విరికోలు శ్రీనివాస్, పెట్టెం మల్లిఖార్జున్, గుర్రం కిరణ్‌లు తమ నామినేషన్లు ఉపసంహరించుకు న్నట్లు రాష్ట్ర ఎన్నికల అదికారి డాక్టర్ శశాంక్ గోయల్ వెల్లడించారు. 12మంది నామినేషన్లు ఉపసంహరిం చుకోవడంతో పోటీలో 30మంది నిల్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల ఉపసంహరణ అంకం ముగియడంతో ఉప ఎన్నికల అసలు కసరత్తును ఎన్నికల సంఘం మొదలు పెట్టింది.
తుది బరిలో నిలిచిన అభ్యర్ధుల సంఖ్య తేలడంతో కీలకమైన గుర్తుల కేటాయింపు ఈసీ మొదలు పెట్టింది. ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులతోపాటు మరో 27మంది పోటీలో ఉన్నారు. ఒక్కో ఈవీఎంలో 16 గుర్తులకు అవకాశం ఉండ టంతో ఒక్కో పోలింగ్ కేంద్రంలో రెండు ఈవీఎంలను వినియోగించనున్నారు. మొదటి ఈవీఎం బ్యాలెట్లో 16మంది, ఆ తర్వాత మిగిలిన అభ్యర్థులతోపాటు నోటాకు స్థానం కల్పంచనున్నారు. రెండు బ్యాలెట్లో అభ్యర్థుల పేర్లు, ఫొటోలు, గుర్తులను ప్రింట్ చేసి కనిపించేలా ఈసీ చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే స్వతంత్రులకు నామినేషన్ల సమయంలోనే కొన్నింటిని ఎంపిక చేసుకోగా, మిగిలిన వారికి ఈసీ గుర్తులు కేటాయించనుంది. ఈవీఎంలలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అక్షర క్రమంలో అభ్యర్థుల పేర్ల మేరకు ప్రాధాన్యత కేటాయిస్తారు. అయితే తొలుత ప్రధాన పార్టీలు, ఆ తర్వాత రాష్ట్ర పార్టీలు, స్వతంత్రు లకు అవకాశం కల్పిస్తారు.
ఉద్యమాల కంచుకోటగా పేరున్న హుజూరాబాద్ గడ్డ ఇక రాజకీయ వేడిని చవిచూడనున్నది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తవడంతో తుది అభ్య ర్థుల జాబితా ఖరారు కావడంతో హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కనుంది. ప్రధాన రాజకీ య పార్టీలు ఇక అసలు ప్రచారం మోగించనున్నారు. ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తమతమ పార్టీల కీలక నేతలతను రంగంలోకి దింపుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు ఇప్పటికే స్టార్ క్యాంపెనర్ల జాబితాను ప్రకటించాయి. నేటి నుంచి ఇక 16 రోజుల గడువు మాత్రమే ఉండటంతో ప్రచార కార్యాచరణ ఖరారు చేసుకుని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈటల రాజేందర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, బల్మూరి వెంకట్లు సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నది. ఇప్పటికే టీఆర్ఎస్ కొవిడ్ నిబంధనల మేరకు సీఎం కేసీఆర్ సభ నిర్వ హించేందుకు ఎన్నికల సంఘం అనుమతి కోరుతూ దరఖాస్తు చేసింది. ఒకవేళ ఈసీ అనుమతి రాని పక్షంలో నియోజక వర్గంలోని చివరి సరిహద్దులో సభ నిర్వహించేందుకు టీఆర్ఎస్ యోచిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు గత నెల రోజులుగా ప్రచారంలో పాల్గొంటూ వస్తున్నారు. తన మార్క్ ప్రచారంతో గ్రామీణులను ఆటోచింప జేస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ప్రచారంలో ఊపు పెంచారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఊరూరా తిరుగుతున్నారు. బీజేపీ నేతలు బండి సంజయ్, విజయశాంతి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బాబూమోహన్లతోపా టు ఎంపీ ధర్మపురి అర్వింద్ తదితరులు ప్రచారంలో పాల్గొనేందుకు కార్యాచరణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్, హన్మంతరావు, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోపాటు రాష్ట్ర పార్టీ ఇన్చార్జీ మాణిక్కం ఠాగూర్, మధుయాష్కీగౌడ్, భట్టి విక్రమార్క, అజారుద్దీన్ వంటి నేతలు ప్రచారానికి రానున్నారు.