Monday, January 13, 2025

Huzurabad Attack – స్పీక‌ర్ వ‌ద్ద‌కు చేరిన కౌశిక్ రెడ్డి పంచాయితీ

హైదరాబాద్ – హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన అధికారిక సమావేశంలో దుర్భాషాలాడారని లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నారని… ఇందుకుగాను అతనిపై చర్యలు తీసుకోవాలని సంజయ్ కోరారు. స్పందించిన స్పీకర్ ప్రసాద్ కుమార్… నివేదిక తెప్పించాక చర్యలు తీసుకుంటామన్నారు.


కరీంనగర్ కలెక్టరేట్‌లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ని ఉద్దేశించి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వాగ్వాదం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు న‌మోదు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement