Tuesday, November 26, 2024

మొగ‌న్ని రోకలిబండతో చంపి పాతిపెట్టింది.. ల‌వ‌ర్‌తో ఎంజాయ్​ చేయనీకే ఇట్లా చేసిందట!

కరీంనగర్‌ జిల్లాలోని గన్నేరువరం మండలంలో దారుణం జ‌రిగింది. మండలంలోని గుండ్లపల్లి మొగుడిని రోక‌లిబండ‌తో కొట్టి చంపేసింది ఓ మ‌హిళ‌. గుండ్లపల్లికి చెందిన పెనుగొండ లక్ష్మి, వెంకట్‌రెడ్డి భార్యాభర్తలు. లక్ష్మికి ఇంకొక‌రితో వివాహేత‌ర సంబంధం ఉంది. దీనిపై భార్యభర్తల మ‌ధ్య రెగ్యుల‌ర్‌గా లొల్లి జ‌రుగుతుండేది. ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న వెంకట్‌రెడ్డిని తొల‌గించుకోవాల‌ని, అప్పుడే తాము ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చ‌ని నిర్ణ‌యించుకున్న‌ది. ఇక ఆలోచ‌న‌ను అమ‌ల్లో పెట్టేసింది. రోకలిబండతో అతడిని కొట్టి చంపేసి డెడ్‌బాడీని ఆమె ల‌వ‌ర్ అయిన‌ వెంకటస్వామి హెల్ప్‌తో హుస్నాబాద్‌ పొట్లపల్లి వాగులో పూడ్చిపెట్టింది. అయితే వెంకట్‌రెడ్డి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లెయింట్ చేశారు. కాగా, దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులైన‌ పెనుగొండ లక్ష్మి, ఆమె ల‌వ‌ర్‌ వెంకటస్వామిని అరెస్టు చేశారు.

పాతిపెట్టిన మృతదేహాన్ని బయటికి తీయించి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు
Advertisement

తాజా వార్తలు

Advertisement