మొయినాబాద్ : మండలం కనకుమామిడి గేట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు. అధికారిక కార్యక్రమం ముగించుకుని వస్తున్న మంత్రి సబితారెడ్డి,.వెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మృతదేహాల వద్ద నివాళులర్పించారు. ఆర్టీసీ బస్ ఢీకొన్న సంఘటనలో బైక్ మీద వెళ్తున్న నగరానికి చెందిన ఇరువురు మృతిచెందగా, అదే రోడ్డులో నగరం వైపునకు వెళ్తున్న మంత్రి సబితా రెడ్డి కాన్వాయ్ అపి సహాయక చర్యలు చేపట్టారు. ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి మృత దేహాలను దగ్గరుండి పోస్ట్ మార్టంకు తరలించే వరకు అక్కడే ఉన్నారు. పోలీసులకు పలు సూచనలు చేసారు. రోడ్డు ప్రమాద సంఘటనపై మంత్రి సబితా రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital