Saturday, January 4, 2025

Hunting – మ‌రో వివాదంలో మంచు ఫ్యామిలీ .. అడవి పందుల‌ను వేటాడిన విష్ణు సిబ్బంది

అడ‌వీ పందుల‌నువేటాడిన విష్ణు సిబ్బంది
మేనేజ‌ర్ , ఎల‌క్ట్రీషియ‌న్ ల నిర్వాకం
వేట దృశ్యాలు వీడియాలో హాల్ చ‌ల్
చ‌ర్య‌లు తీసుకోవాలంటూ నెటిజెన్లు డిమాండ్లు

హైద‌రాబాద్ – మంచు ఫ్యామిలీ తీరు రోజు రోజుకి వివాదాస్పదంగా మారుతుంది. ఇటీవల మంచు విష్ణు, మనోజ్ జల్ పల్లిలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు కేసులు వరకు వెళ్ళింది ఈ వ్యవహారం. అటు మోహన్ బాబు ఓ జర్నలిస్ట్ పై దాడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. మరోసారి మంచు బ్రదర్స్ ఏదైనా హంగామా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన పోలీసులు ఆదేశాలను మంచు విష్ణు అనుచరులు పట్టించుకోవట్లేదు.

- Advertisement -

తాజాగా జ మంచు విష్ణు సిబ్బంది మరో వివాదంలో చిక్కుకున్నారు. మెహన్ బాబు నివాసం జల్ పల్లి లోని అడవిలో వేట కొనసాగించారు విష్ణు సిబ్బంది. జల్ పల్లిలోని చిట్ట అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకువచ్చాడు మంచు విష్ణు మేనేజర్ కిరణ్. వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లాడు ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్. గతంలోను వీరు ఇలాగె చేసే వారని ఇద్దరి చర్యలను తప్పుపడుతూ మంచు మనోజ్ పలుమార్లు అభ్యంతరం చెప్పినట్లు స‌మాచారం . . అడవిలోకి వెళ్లి పందులను వేటాడొద్దని మనోజ్ హెచ్చరించినా మేనేజర్, ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్ లు ప‌ట్టించుకోకుండా అడవి పందులను వేటాడారు.. వాటిని బంధించి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా పాటలు పాడుకుంటూ అడవి పందులను తీసుకువెళ్తున్నారు మంచు విష్ణు అనుచరులు. అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్స్. దీనిపై అట‌వీ శాఖ అధికారులు సీరియ‌స్ గా స్పందించి నోటీస్ లు జారీ చేసిన‌ట్లు స‌మాచారం .

Advertisement

తాజా వార్తలు

Advertisement