వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు..అనంతరం ఆయన మాట్లాడుతూ..ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కృషి వల్లనే మహబూబ్ నగర్ జడ్చర్లలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభమైంది. లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆస్పత్రి ఊరికి దూరంగా ఉండకూడదు అని తన సొంత స్థలాన్ని ఇచ్చి నిర్మాణానికి కృషి చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మహబూబ్ నగర్ కి ఎందుకు మెడికల్ కాలేజీ రాలేదు.రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందన్నారు. 20 ఏళ్లకు ఒక మెడికల్ కాలేజీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు వస్తే , కేవలం గత సంవత్సరంలో 8 మెడికల్ కాలేజీలు, ఈ సంవత్సరం తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించబోతున్నాం.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయి.గతంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ కి కూడా 50 పడకల ఆసుపత్రి మా లక్ష్మారెడ్డి ఇచ్చారు. జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో మరీ ముఖ్యంగా ఆరోగ్య రంగంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగాయి.
కల్వకుర్తి, నెట్టెంపాడు ,బీమా, కోయిల్ సాగర్ లో ఈరోజు నీళ్లు వచ్చాయి అంటే కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ , BRS ప్రభుత్వం వల్లే సాధ్యమైంది.మహబూబ్ నగర్ నుంచి బొంబాయి బస్సులు బంద్ అయినాయి. కెసిఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా. గమ్యాన్ని ముద్దాడే వరకు అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించింది ముఖ్యమంత్రి కేసీఆర్.కాగా కెసిఆర్ కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యే వాడివా. నీకు ఆ పదవి వచ్చిందంటే రాష్ట్రం సాధించినందుకే వచ్చిందన్న విషయాన్ని మర్చిపోవద్దు. అబద్ధపు ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేయడం కాదు. జరుగుతున్న అభివృద్ధిని చూసి మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో అమలు చేయండి .BRS ప్రభుత్వం తెలంగాణ సంక్షేమంలో, అభివృద్ధిలో పాస్ అయింది. ఫెయిల్ అయింది మేం కాదు కాంగ్రెస్ నాయకులు ఫెయిల్ అయ్యారు. ప్రజల మన్నను పొందడంలో ఫెయిల్ అయ్యారు. ప్రజల అభివృద్ధి ఆకాంక్షను తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ప్రకృతి వైపరీత్యాల కంటే దారుణంగా రాష్ట్రంలో ప్రతి పక్షాలు తయారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి వచ్చి ఎక్కువ మాట్లాడారు. మీ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలసకు వచ్చి ఇక్కడ బతుకుతున్నారంటేనే మీరు అర్థం చేసుకోండి మీ పరిపాలన ఎంత గొప్పగా ఉందో.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు మర్చిపోయారు అనుకున్నారా. తాగడానికి నీళ్లు లేక బిందెలు మోసిన ఆడబిడ్డలు మరువలేదు. నీళ్ల కోసం వైద్యం కోసం కరెంటు కోసం పడ్డ ఇబ్బందులు తెలంగాణ సమాజం మర్చిపోలేదు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ నరకయాతన అనుభవించాల్సి వస్తుందని భయపడుతున్నారు. కాంగ్రెస్ బిజెపిల జూటా ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అనే ఆయుధంతో తిప్పి కొట్టాలి.నిజాన్ని మాట్లాడకపోతే నిజాన్ని చర్చించకపోతే అబద్ధమే నిజమై ప్రపంచాన్ని చుట్టేస్తుంది అని మహనీయుల డాక్టర్ అంబేద్కర్ చెప్పిన మాటలను మనం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ సంక్షేమాన్ని అభివృద్ధిని పొందుతున్న ప్రతి ఒక్కరిని ఓటు అడుగుతాము మాకు హక్కు ఉంది.మీరేం చేశారని ఏ ముఖం పెట్టుకొని ఓటడుగుతారు . ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ జండా ఎగురుతుంది.తండాలను గ్రామపంచాయతీలు చేస్తామని రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గిరిజనులను మోసం చేసింది. టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే తండాలను గ్రామపంచాయతీలుగా చేసింది.