ఉప్పల్‌స్టేడియంలో బుధవారం జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్మ్యాచ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 2,800 మంది పోలీసులు, 360 సీసీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
స్టేడియం పరిసరాల్లో 300 మంది ట్రాఫిక్ పోలీసులు, 918 మంది సివిల్ పోలీసులు, 12 ప్లాటూన్ల స్పెషల్ ఫోర్స్ పోలీసులు, రెండు ఆక్టోపస్ టీమ్స్,10 మౌంటెడ్పోలీస్, 10 వజ్రా వాహనాలు, ఎస్ బీ , సీసీఎస్, ఎస్ఓటీ తదితర పోలీస్‌బలగాలు విధుల్లో ఉండి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయన్నారు. నాలుగు వేల కార్లు, ఆరు వేల బైకుల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మ్యాచ్టైంలో ఎల్బీనగర్, వరంగల్ నుంచి హబ్సిగూడ వైపు వచ్చే భారీ వెహికల్స్ ను అనుమతించబోమని, సదరు వెహికల్స్చంగిచర్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.ఈసీఐఎల్, కుషాయిగూడ, చర్లపల్లి నుంచి ఉప్పల్వైపు వచ్చే వెహికల్స్ ను మల్లాపూర్, చంగిచర్ల క్రాస్ మీదుగా డెవర్ట్చేస్తామని చెప్పారు. పాస్‌లు కలిగిన దివ్యాంగులు గేట్ నంబర్ 3 నుంచి స్టేడియంలోకి రావాలని సూచించారు. సాయంత్రం 4.30గంటల నుంచి ఫ్యాన్స్ ను స్టేడియంలోకి అనుమతిస్తామని వెల్లడించారు.
స్టేడియంలోకి ఇవి తీసుకురావద్దు
ల్యాప్‌టాప్‌లు, వాటర్‌బాటిళ్లు, బ్యానర్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్గ్యాడ్జెట్లు, మ్యాచ్బాక్సులు, సిగరెట్లు, లైటర్లు, పదునైనా కత్తులు, బ్లేడ్లు, ప్లాస్టిక్ వస్తువులు, బైనాక్యూలర్లు, రైటింగ్పెన్స్, బ్యాటరీలు, హెల్మెట్లు, పెర్ఫ్యూమ్బాటిల్స్, బ్యాగులు, ఫుడ్‌ఐటమ్స్ స్టేడియంలోకి తీసుకురావొద్దని సీపీ సూచించారు. స్టేడియం వద్ద బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మ్యాచ్సందర్భంగా మెట్రో, ఆర్టీసీ అధికారులు అదనపు సర్వీసులను నడుపుతున్నారని, వినియోగించుకోవాలని సూచించారు.