Monday, November 25, 2024

TS : ఉప్ప‌ల్ మ్యాచ్ కు భారీ బందోబ‌స్తు…

ఉప్పల్​స్టేడియంలో బుధవారం జరగనున్న సన్​రైజర్స్ ​హైదరాబాద్ వర్సెస్​ ముంబై ఇండియన్స్​మ్యాచ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 2,800 మంది పోలీసులు, 360 సీసీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

- Advertisement -

స్టేడియం పరిసరాల్లో 300 మంది ట్రాఫిక్​ పోలీసులు, 918 మంది సివిల్​ పోలీసులు, 12 ప్లాటూన్ల స్పెషల్​ ఫోర్స్ పోలీసులు, రెండు ఆక్టోపస్​ టీమ్స్,10 మౌంటెడ్​పోలీస్, 10 వజ్రా వాహనాలు, ఎస్ బీ , సీసీఎస్​, ఎస్ఓటీ తదితర పోలీస్​బలగాలు విధుల్లో ఉండి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయన్నారు. నాలుగు వేల కార్లు, ఆరు వేల బైకుల పార్కింగ్​కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మ్యాచ్​టైంలో ఎల్​బీనగర్, వరంగల్ నుంచి హబ్సిగూడ వైపు వచ్చే భారీ వెహికల్స్ ను అనుమతించబోమని, సదరు వెహికల్స్​చంగిచర్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.ఈసీఐఎల్, కుషాయిగూడ, చర్లపల్లి నుంచి ఉప్పల్​వైపు వచ్చే వెహికల్స్ ను మల్లాపూర్, చంగిచర్ల క్రాస్ మీదుగా డెవర్ట్​చేస్తామని చెప్పారు. పాస్​లు కలిగిన దివ్యాంగులు గేట్ నంబర్ 3 నుంచి స్టేడియంలోకి రావాలని సూచించారు. సాయంత్రం 4.30గంటల నుంచి ఫ్యాన్స్ ను స్టేడియంలోకి అనుమతిస్తామని వెల్లడించారు.
స్టేడియంలోకి ఇవి తీసుకురావద్దు
ల్యాప్​టాప్​లు, వాటర్​బాటిళ్లు, బ్యానర్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్​గ్యాడ్జెట్లు, మ్యాచ్​బాక్సులు, సిగరెట్లు, లైటర్లు, పదునైనా కత్తులు, బ్లేడ్లు, ప్లాస్టిక్​ వస్తువులు, బైనాక్యూలర్లు, రైటింగ్​పెన్స్, బ్యాటరీలు, హెల్మెట్లు, పెర్​ఫ్యూమ్​బాటిల్స్, బ్యాగులు, ఫుడ్​ఐటమ్స్ స్టేడియంలోకి తీసుకురావొద్దని సీపీ సూచించారు. స్టేడియం వద్ద బ్లాక్​లో టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మ్యాచ్​సందర్భంగా మెట్రో, ఆర్టీసీ అధికారులు అదనపు సర్వీసులను నడుపుతున్నారని, వినియోగించుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement